తెలంగాణాలో పులి ఆ రక్తమే మరిగిందా.. అంతా టెన్షన్ ?

-

తెలంగాణా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం టెన్షన్ పుట్టిస్తున్నాయి. మహబూబబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ఎందుకంటే ఆ జిల్లాలోని గుంజేడు ముసలమ్మ ఆలయం వద్ద భక్తులు ఇచ్చే జంతుబలి రక్తపు రుచి మరిగి అదే ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. పాదముద్రల ఆధారంగా రెండు పులులు తిరుగుతున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. 

మొన్న రాంపూర్‌ అటవీ ప్రాంతంలో ఓ ఆవును చంపేసింది పులి. తాజాగా గుంజేడు ముసలమ్మ ఆలయ సమీపంలో పులి పాదముద్రలు కనిపించడంతో తీవ్ర భయాందోళనలో జనం మునిగిపోయారు. పులిని ప్రత్యక్షంగా చూసినవారిలో అయితే తీవ్ర భయాందోళన నెలకొంది. కొత్తగూడ మండలంలోని గుంజేడు దేవాలయ పరిసర ప్రాంతాలలో జంతు బలులు అధికంగా జరగడంతో ఆ రక్తం వాసన మరిగిన పులులు ఇక్కడ తిష్ట వేస్తున్నాయని భయభ్రాంతులకు గురువుతున్నారు అక్కడి ప్రజలు. గత వారం రోజులుగా పులి సంచారంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news