దీపావళి : ఈ ఏడాది కంటి గాయాలు తగ్గాయట, కానీ ?

తెలంగాణ లో దీపావళి పండుగ అంబరాన్నంటిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కోరలు చాచుతోన్నా ఈ పండగ ఆసక్తికరంగా సాగింది అని చెప్పవచ్చు/ ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది కంటి ఆసుపత్రికి వచ్చే కేసులు తగ్గాయి. ప్రతి ఏడాది భారీ ఎత్తున టపాసులు కాల్చటంతో కళ్ళకు గాయాల కారణంగా కంటి ఆసుపత్రికి జనం క్యూ కట్టే వాళ్ళు కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనబడటం లేదు. హైదరాబాద్ లోని ప్రముఖ కంటి ఆసుపత్రి సరోజినీ హాస్పిటల్ కి చికిత్స కోసం రెండు కేసులు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అలానే ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి కూడా దాదాపు తొమ్మిది కేసులు దాకా వచ్చినట్లు చెబుతున్నారు. ఈ కేసులు అన్నీ కూడా అక్కడిక్కడ ఐ వాష్ చేసుకుని వెళ్ళిపోయేవి గానే చెప్తున్నారు డాక్టర్లు. ఇవి చాలా మైనర్ కేసులని ఐ వాష్ చేసుకుని మందులు తీసుకుంటే సరిపోతుంది అని చెబుతున్నారు. అయితే గాయాల సంఖ్య భారీగా తగ్గిన కాలుష్యం మాత్రం భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 106 పాయింట్ గా ఉంది. దీపావళి ముందు రోజు అంటే నిన్న గాక మొన్న ఇండెక్స్ 57 పాయింట్స్ గా ఉంది. అంటే దాదాపు నిన్న ఒక్క రోజులు ఈ గాలిలో కాలుష్యం రెండింతలు ఎక్కువైందని చెప్పొచ్చు.