భారత్ చైనా ఘర్షణల కారణంగా భారత్ లో బ్యాన్ చైనా ఉద్యమం ప్రారంభమయ్యింది. ఈ దిశలో సుప్రీం కోర్టు 59 చైనా యాప్ లను నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ 59 యాప్ లలో టిక్ టాక్ కూడా ఒకటి. టిక్ టాక్ భారత దేశం లోనే అత్యధికంగా వాడుతున్న యాప్ లలో ఒకటి. కోట్ల మంది ప్రజలు టిక్ టాక్ ను వాడుతున్నారు. ఎంతో మంది ఉద్యోగులకి టిక్ టాక్ ఉపాధి కల్పించింది. కాగా టిక్ టాక్ నిషేదించడంతో ఆ ఉద్యోగులకు కొంత కష్టకాలం వచ్చి పడింది. దీంతో టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ ఉద్యగులను ఉద్దేశిస్తూ ‘ఏ మెసేజ్ టూ అవర్ ఎంప్లాయిస్ ఇన్ ఇండియా’ అనే టైటిల్ తో లేఖ రాశారు.
టిక్ టాక్ ద్వారా ప్రజల్లో ఇంటర్నెట్ పై అవగాహన అలవాటు కలిగేలా మనం అందరం కృషి చేశాం. పల్లె ప్రజలు కూడా ఇంటర్నెట్ వాడెలా మనం చేయగలిగాం. భారత చట్టానికి ప్రాధాన్యత ఇస్తూ అన్నీ నిబంధనలను మనం పాటించాం, ప్రజల వ్యక్తిగత డేటా కు ఎటువంటి హాని కలగకుండా మనం అన్నీ చర్యలు తీసుకున్నాం. 2018 నుండి మనం నిరంతరం కృషి చేస్తూ 20 కోట్ల మంది యూజర్లు వచ్చేలా చేయగలిగాం. ఈ మన పయనం లో ప్రతీ ఒక్కరూ అద్భుతమైన నైపుణ్యత కనబరచారు. ప్రతీ ఒక్క ఉద్యోగి కృషి ద్వారానే మనం పట్టణాలు దాటి పల్లెలో కి అడుగుపెట్టాం. మన ఉద్యోగులే సంస్థకు బలం. వారి బాగోగులు సంస్థకు ప్రాధాన్యం. ఇక్కడ ఉన్న 2 వేల మంది ఉద్యోగుల మేలు కోసం అన్ని చర్యలూ తీసుకుంటాం అంటూ ఆయన ఆ లేఖ లో ప్రస్తావించారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు త్వరలో ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అందరికీ పేరుపేరునా నా అభినందనలు అంటూ ఆయన లేఖ లో పేర్కొన్నారు.