వచ్చె నెలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ అసెంబ్లి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు నరేష్ టీకాయత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ మద్ధతు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి ఉంటుందని ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ లో రైతులతో పాటు ప్రజల మద్దతు కూడా సమాజ్ వాదీ పార్టీకే ఉందని ఆయన అన్నారు.
అలాగే వచ్చె ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. కాగ ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, లోక్ దళ్ పార్టీ కూటమీగా ఏర్పాడ్డాయి. ఈ కూటమీకే భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు నరేష్ టికాయిత్ మద్దతు ప్రకటించారు. కాగ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టీకాయత్ రైతులను ముందు ఉండి నడిపించాడు. కాగ భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు నరేష్ టికాయిత్ సోదరుడు రాకేష్ టీకాయత్.