ప్రముఖ యూట్యూబర్ క్యారీమినాటి ఉదంతం అనంతరం గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్ రేటింగ్ మరీ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ప్లే స్టోర్‌లో టిక్‌టాక్ రేటింగ్ 1.2కు చేరుకుంది. అలాగే యాపిల్ యాప్ స్టోర్‌లో 3.5 వద్ద టిక్‌టాక్ రేటింగ్ కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం దేశంలో ఇండియన్స్ ఎగెనెస్ట్ టిక్‌టాక్ అనే ఉద్యమం జోరుగా కొనసాగుతోంది.
స్టార్ యూట్యూబర్ క్యారీమినాటి యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్ పేరిట చేసిన వీడియో డిలీట్ అవ్వడం.. యూట్యూబర్లపై టిక్‌టాక్ యూజర్లు కామెంట్లు చేయడంతో.. పెద్ద ఎత్తున ప్రారంభమైన బ్యాన్ టిక్‌టాక్ ఉద్యమం ఇప్పుడప్పుడే తగ్గే సూచనలు కనిపించడం లేదు. కాగా మరోవైపు పాపులర్ టిక్‌టాక్ యూజర్ ఫైజల్ సిద్దికి అకౌంట్‌ను టిక్‌టాక్ సస్పెండ్ చేసింది. మహిళలపై యాసిడ్ దాడులను ప్రోత్సహించే విధంగా వీడియోలు చేశాడన్న ఆరోపణలపై టిక్‌టాక్ అతని అకౌంట్‌ను నిలిపివేసింది. అయినప్పటికీ టిక్‌టాక్‌పై యూట్యూబర్ల మంటలు చల్లారడం లేదు. పైగా ఆయా యాప్‌స్టోర్‌లలో టిక్‌టాక్ పట్ల యూట్యూబర్లు పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఇక అంతకు ముందు రెండు యాప్ స్టోర్‌లలో టిక్‌టాక్ రేటింగ్ 4.5 వరకు ఉండేది. కానీ యూట్యూబర్ల దెబ్బకు ప్రస్తుతం టిక్‌టాక్ షేకవుతోంది. అయితే టిక్‌టాక్ రేటింగ్ ముందు ముందు ఇంకా పడిపోతే.. యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తారా.. లేదా.. అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.