టిక్ టాక్ స్టార్ గా ఎందరో అభిమానులను సంపాదించుకొన్న సియా కక్కర్ ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ విషయాన్ని సియా వ్యక్తిగత మేనేజర్ అర్జున్ అధికారికంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. 16 ఏండ్ల వయస్సులో సియా కక్కర్ తన టిక్ టాక్ వీడియోల ద్వారా దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్న సియా కక్కర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఇంకా తెలియ రాలేదు.
ఆమె ఆత్మహత్య విషయం తెలియగానే అభిమానులు షాక్ కి గురయ్యారు. అయితే దీనిపై సియా కుటుంబం నుంచి ఇంతవరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సియా చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావడం లేదని ఆమె మేనేజర్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదిరిచూస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.