Tillu square : ‘టిల్లు స్క్వేర్’ మూవీ నుంచి హార్ట్ బ్రేక్ సాంగ్ రిలీజ్

-

సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా డీజె టిల్లు సినిమాతో ఈ యంగ్ హీరో ఫేమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.

తాజాగా ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నుంచి మేకర్స్ మరో పాటను విడుదల చేశారు. ‘ఓ మై లిల్లీ’ అంటూ సాగే ఈ హార్ట్ బ్రేక్ సాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది.ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ నెల 29న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్స్, సాంగ్ విడుదల అయి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news