దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించింది.
ఇదిలా ఉంటే… రాష్ట్రంలో 2019లో లోక్సభ ఎన్నికలు మొదటి ఫేజ్లోనే నిర్వహించగా.. ఈ సారి 4వ ఫేజ్ కి మార్చడంపై తాజాగా రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ స్పందించారు. ఎన్నికలను నాలుగవ ఫేజ్ లో నిర్వహించడంలో తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన తెలిపారు.కేంద్ర ఎన్నికల సంఘమే దీనిపై సమీక్షించి, నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో వారే నిర్ణయించారని ఆయన స్పష్టం చేశారు.