టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక …..చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సభ పై సంజల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.పదేళ్ల తర్వాత కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
‘ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడం.. హామీలు ఇవ్వడం వీరికి అలవాటుగా మారింది అని ఆయన అన్నారు. వాటిని నెరవేర్చకుండా తిరిగి ఏ ముఖం పెట్టుకుని కలిశారు? అని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనే ఆత్రుత చంద్రబాబుకు ఎక్కువైంది అని విమర్శించారు.. నిన్నటి ‘ప్రజాగళం’ సభ పూర్తిగా విఫలమైంది’ అని అన్నారు.అబద్ధాలు, మోసం, బాధ్యతారాహిత్యం వాళ్లలో కట్టొచ్చినట్లు కనిపిస్తోందని , కేవలం సీఎం జగన్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు .కనీసం దేశ ప్రధానిని సత్కరించేందుకు శాలువా, పుష్పగుచ్ఛం కూడా తీసుకురాని పార్టీలు అవేం భాగస్వామ్య పక్షాలంటూ రామకృష్ణ రెడ్డి ఎద్దేవా చేశారు.