సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘టిల్లు స్క్వేర్’.. రన్ టైం ఎంతంటే.?

-

సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా డీజె టిల్లు సినిమాతో ఈ యంగ్ హీరో ఫేమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాకు యూ/ఏ (U/A)సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్) లో ప్రకటించింది. ఇక రన్‌టైం విషయానికి వస్తే.. 121 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌ ఈ సినిమాపై హైప్ పెంచేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news