దంతాలు నొప్పిగా ఉన్నాయా..? ఈ చిట్కాలు పాటించండి..!

-

మ‌న‌లో అధిక‌శాతం మందికి అప్పుడ‌ప్పుడు దంత స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. చిగుళ్ల వాపులు రావ‌డం, దంత క్ష‌యం సంభ‌వించ‌డం లేదా ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌కూడా దంతాలు నొప్పి క‌లుగుతుంటాయి. దీంతో చెప్ప‌లేని బాధ క‌లుగుతుంది. అయితే అందుకు కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే చాలు.. దంతాల నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. ఆ చిట్కాలు ఏమిటంటే…

tips to reduce tooth pain

* ఉల్లిపాయ‌ను తీసుకుని చిన్న ముక్క‌ను క‌ట్ చేసి దాన్ని నొప్పి ఉన్న దంతంపై కొంత సేపు ఉంచాలి. దీంతో దంతాల నొప్పి త‌గ్గుతుంది.

* ల‌వంగం నూనె 2, 3 చుక్క‌లు, ఆలివ్ నూనె పావు టీస్పూన్ తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. కాట‌న్ బాల్స్ ను ఆ మిశ్ర‌మంలో ముంచాలి. అనంత‌రం వాటిని నొప్పి ఉన్న దంతాల‌పై రాయాలి. త‌ర‌చూ ఇలా చేస్తే దంతాల నొప్పులు రాకుండా ఉంటాయి.

* కీర‌దోసను చిన్న ముక్క రూపంలో క‌ట్ చేసి దాన్ని దంతాల‌పై ఉంచినా నొప్పి త‌గ్గుతుంది.

* నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో టీ బ్యాగును అమోఘంగా ప‌నిచేస్తాయి. టీ బ్యాగ్ లు వేడిగా ఉండగానే ఒక బ్యాగ్‌ను తీసుకుని దంతాల‌పై ఉంచాలి. నొప్పి ఉన్న దంతంపై ఆ బ్యాగ్‌ను ఉంచితే వెంట‌నే నొప్పి త‌గ్గుతుంది.

* అల్లంను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి వాటిని నోట్లో వేసుకుని న‌మ‌లాలి. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు దంతాల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి.

* లవంగాల‌ను న‌ములుతున్నా దంతాల నొప్పి త‌గ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news