తిరుమల భక్తులకు అలర్ట్.. ఇవాళ దర్శనాలకు 8 గంటల సమయం పడుతుంది. తిరుమలలో 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమలలో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 8 గంటల సమయం పడుతుంది. అటు నిన్న ఒక్క రోజే 51, 349 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

14082 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్లుగా నమోదు అయింది.
- తిరుమల….3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనం కు 8 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 51349 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 14082 మంది భక్తులు
- హుండీ ఆదాయం 3.65 కోట్లు