భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్లు

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుమలలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లో సర్వదర్శనం టోకెన్లు పంపిణీ చేయనున్నట్లు దేవస్థానం ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, వసతులు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

శని, ఆది, సోమవారాల్లో 25వేల టోకెన్లు, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో 15వేల టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తి అయితే కౌంటర్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. టోకెన్లు లేని భక్తులు కూడా కొండపై సర్వదర్శనానికి వెళ్లొచ్చని చెప్పారు. టోకెన్లు క్రమంగా పెంచుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా వేంకటేశ్వరస్వామి వారి దర్శనాలు కల్పిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news