తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా ఆలయ అధికారులు స్పష్టం చేశారు. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన తిరుమల తిరుపతి ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూసి వేయబోతున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు.

7వ తేదీ ఆదివారం రాత్రి 9:50 గంటల నుంచి 8వ తేదీ సోమవారం వేకువ జామున 1:30 వరకు చంద్రగ్రహణం సమయం ఉన్నట్లుగా టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో 7వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎవరు రాకూడదని స్పష్టం చేశారు అధికారులు. దాదాపు ఆలయాన్ని 12 గంటల పాటు మూసి వేస్తున్న కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆ కారణంగా సెప్టెంబర్ 8వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినట్లయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చని తెలిపారు. కాగా, సెప్టెంబర్ 8వ తేదీన యధావిధిగా శ్రీవారి దర్శనం ఉండనుంది.