గంటా నాకు చిరకాల మిత్రుడు.. స్పీకర్ అసక్తికర వ్యాఖ్యలు !

Join Our Community
follow manalokam on social media

గంటా శ్రీనివాసరావు తనను కలిసిన అంశం మీద స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంటా శ్రీనివాసరావు నన్ను  మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చారన్న ఆయన గంటా నాకు చిరకాల మిత్రుడు అని అన్నారు. టీడీపీ , పీఆర్పీలో మేం కలిసి పని చేశామని అన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని గంటా నన్ను కోరారని అయితే గతంలో ఇచ్చిన రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లో లేదని అందుకే మరోసారి రాజీనామా లేఖ పంపించారని అన్నారు.

తాజాగా ఇచ్చిన లేఖను పరిశీలిస్తానని ఆయన అన్నారు. అంతకుముందు గంటా మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా నేను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ను కోరానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజీనామాను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్న ఆయన అమరావతి వెళ్లిన తర్వాత నాలుగు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారని అన్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...