ఆ పదవి పేరు చెబితే హడలిపోతున్న వైసీపీ నేతలు

-

అధికారంలో ఉన్న పార్టీ పైగా జిల్లా అధ్యక్ష పదవి అంటే ఏ నేతైన ఎగిరి గంతేస్తారు. జిల్లా పార్టీ పై కమాండింగ్ తో పాటు హోదాకి హోదా..గౌరవానికి గౌరవం ఉంటుంది. కానీ వైసీపీలో నేతలు మాత్రం విశాఖ జిల్లా అధ్యక్ష పదవి అంటే అమడ దూరం జరుగుతున్నారు. కలిసిరాని పదవి కోసం రిస్క్‌ చేయడం ఎందుకని సైలెంట్ అవుతున్నారు.

ఉత్తరాంధ్ర రాజకీయాలకు కీలక స్థానం విశాఖపట్టణం. పైగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ ప్రాధన్యతలు మారాయి. స్టీల్ సిటీకి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. టీడీపీతో పోలిస్తే అధికార వైసీపీ లో సిటీ ప్రెసిడెంట్ కీలకం. అయితే అలాంటి కీలకమైన పదవిని సైతం వద్దనుకుంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఆ పదవి చేపట్టిన నేతలంతా రాజకీయంగా కనుమరుగయ్యారని స్థానిక వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

గ్రేటర్ విశాఖ ఎన్నికల ముందు వరకు ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేశారు సీనియర్ నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్. కార్పొరేటర్‌గా గెలిచిన వంశీకి మేయర్ పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా బీసీ మహిళ హరి వెంకట కుమారికి చాన్స్ దక్కడంతో అవక్కాయ్యారు వంశీకృష్ణ. ఆ మనస్థాపంతో సిటీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. పార్టీ పదవి కారణంగా విలువైన సమయం కోల్పోయానని, ఆర్థికంగా నష్టపోయానని చెబుతూ పార్టీలోని సన్నిహితుల వద్ద ఊసురుమన్నారు.

ఇక నగర అధ్యక్షుడి కోసం వేట మొదలెట్టిన వైసీపీ పెద్దలు సమర్ధుడైన నాయకుడి కోసం కసరత్తు చేస్తున్నారు. విశాఖ ఉత్తరం నుంచి పోటి చేసి గంటా చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన కేకే రాజు పట్ల సానుకూలంగా ఉందట వైసీపీ అధిష్టానం. అయితే సిటీ అధ్యక్ష పదవి తీసుకునేందుకు కేకే రాజు సిద్దంగా లేనట్లు తెలుస్తుంది. దీనికి యాంటీ సెంటిమెంటే కారణమనే వాదన ఉంది. వైసీపీ ఆవిర్భావం సమయంలో కన్వీనర్‌గా పనిచేసిన రవిరాజు రాజకీయంగా కనుమరుగయ్యారు.

సిటీ అధ్యక్ష పదవిలో ఎక్కువ కాలం మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్, వంశీకృష్ణ శ్రీనివాస్‌లు పనిచేశారు. కానీ వీరిద్దరికి గత ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టే చాన్స్ మిస్సయింది. ఇక విశాఖ జిల్లా అధ్యక్షపదవిలో కొనసాగిన గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. సీఎం జగన్ కి సన్నిహితం కావడంతో మంత్రి పదవి గ్యారెంటి అనుకున్నారు కానీ అదృష్టం దక్కలేదు. ఇలా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలంటే హడలి పోతున్నారు వైసీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news