బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే హిట్లర్ పాలనే : సిపిఎం

-

ఈ రోజు తమిళనాడుకు చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు జి రామకృష్ణన్ దేశ రాజకీయాల గురించి తనకు తెలిసింది మాట్లాడారు. ఇందులో ఒక విషయాన్నీ క్లియర్ గా చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాలు లోక్ సభ ఎన్నికల కోసం సిద్ధం అవుతున్న తరుణంలో ఒక అంశం గురించి చెప్పదలచుకున్నాను అంటూ సిపిఎం నాయకుడు రామకృష్ణన్ దేశంలో బీజేపీ పాలనా గురించి మాట్లాడారు. గత తొమ్మిది సంవతస్రాలుగా బీజేపీ అధికారంలో ఉంది, విద్యార్థులకు, పేదలకు, రైతులకు ఎవ్వరికీ ఎటువంటి ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ఫెయిల్ అయ్యారన్నారు. బీజేపీ గెలవడానికి ఎంతకైనా తెగిస్తుంది.. అందుకే సడెన్ గా ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి బిల్లును తీసుకువస్తున్నారు అంటూ రామకృష్ణ దేశ ప్రజలను జాగ్రత్త అంటూ హెచ్చరించాడు.

 

ప్రజలారా ఈ సారి కనుక బీజేపీ గెలిస్తే దేశంలో హిట్లర్ పాలన పునరావృతం అవుతుందని రామకృష్ణన్ చెప్పారు. ఇక ఆయన అభిప్రాయాన్ని తెలుపుతూ .. నా అంచనా ప్రకారం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడం కష్టమే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news