వానా కాలంలో వానలు కురవడం వలన బట్టలు త్వరగా ఆరవు. దానితో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. పైగా సగం సగం బట్టలు ఆరిన తర్వాత అదో రకమైన వాసన వస్తూ ఉంటాయి. వానా కాలంలో బట్టలు ని ఆరబెట్టడానికి చాలా మంది నానా తండాలు పడుతుంటారు అలా కాకుండా ఇలా చేశారంటే బట్టలు బాగా ఆరిపోతాయి బట్టల్ని చాలా మంది వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేస్తూ ఉంటారు. బట్టలు దాదాపుగా నీళ్ళని పిండేసినట్లుగా బయటకి వస్తాయి.
అప్పుడు ఆరబెడితే ఒక గంట లో ఆరిపోతుంటాయి. ఎండ కూడా అక్కర్లేదు నీడ లో ఆరబెట్టినా సరే బట్టలు త్వరగా ఆరిపోతాయి. అదే చేత్తో ఉతికినట్లయితే బట్టలు త్వరగా ఆరిపోయేందుకు నీళ్లు పూర్తిగా బట్టల నుండి వదిలే వరకు పిండుకోవాలి ఆ తర్వాత నీళ్లు ఓడిపోయాక ఆరేస్తే వెంటనే ఆరిపోతాయి. తీగల మీద మీరు బట్టలని ఆరెసేటప్పుడు దూరంగా ఆరేయండి అన్ని కలిపి ఒకే దగ్గర అరేస్తే బట్టలు త్వరగా ఆరిపోతాయి.
బట్టల్ని ఆరబెట్టే స్టాండ్ తీసుకుని మీరు ఫ్యాన్ గాలి కింద ఆరబెడితే కూడా త్వరగా ఆరిపోతాయి బట్టల నుండి వాసన రాకుండా ఉండాలంటే సువాసన కలిగే స్ప్రే లేదంటే ధూపం వేయడం వంటివి చేయండి. బట్టలు త్వరగా ఆరిపోవడమే కాదు మంచి సువాసన కలిగి ఉంటాయి. బట్టల్ని ఆరబెట్టే చోట ఎయిర్ ప్యూరిఫైయర్ బ్యాగులని పెట్టాలి తేమను పీల్చుకునేలా ఉప్పుని ఉంచాలి ఇంట్లో బట్టలు ఆరేసేటప్పుడు పొడి వాతావరణము ఉండేలా చూసుకోవాలి బట్టల ఆరాక ఐరన్ చేస్తే కూడా బట్టలు బాగుంటాయి.