వేసవికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. డిహైడ్రేషన్ మొదలు చాలా సమస్యలు వేసవి కాలంలో తరచూ వస్తుంటాయి. వేసవికాలంలో ఎలర్జీలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఈ వేసవి కాలం లో ఎలర్జీలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వీటిని అనుసరించాలి. వేసవికాలంలో తుమ్ములు, ముక్కు కారడం, కళ్ళనుండి నీళ్లు కారడం కళ్ళు మంట ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలానే దగ్గు తలనొప్పి నీరసం కూడా వేసవికాలంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
వేసవికాలంలో ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వీటిని ట్రై చేయాల్సిందే. వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలన్నా ఎలర్జీలు బారిన పడకుండా ఉండాలన్నా ముఖానికి మాస్క్ వేసుకుని బయటికి వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్కుని అసలు మర్చిపోకండి. అలానే ఏ ఇబ్బంది రాకుండా బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్లీవ్స్ ఉండే బట్టలు ధరించడం. గ్లౌజులు వేసుకోవడం వంటివి చేయండి. వేసవికాలంలో షవర్ చేయడం వలన కూడా సమస్యలు ఉండవు.
వేసవి కాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. నట్స్ వంటివి తీసుకోక పోవడం మంచిది. కొంతమందికి ఎప్పుడూ అలర్జీలు ఉంటూనే ఉంటాయి. వేసవికాలంలో ఇవి ఎక్కువైతే డాక్టర్ని కన్సల్ చేయడం మంచిది ముక్కు కారడం వంటి ఇబ్బందులు ఉంటే హ్యుమిడిఫైయర్ని ఉపయోగించండి. చర్మంపై ర్యాషెస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అన్నిటి కంటే హైజీన్ చాలా ముఖ్యం వేసవికాలంలో చెమట వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఏది ఏమైనా కాస్త జాగ్రత్తగా ఉంటే సమస్యలు అన్నిటికీ దూరంగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు.