మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇవాళ సా. 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై శాసనసభలో చర్చ జరుగనున్నట్లు పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే అందరికీ కాపీలు అందించామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రెడీ చేసిన నోట్ ను సభలో ప్రవేశపెడతాం…. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.