అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . అల్లు కనకరత్నం గారి మృతికి సంతాపాన్ని తెలియజేసి అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ కుటుంబసభ్యులను పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక దీనికి సంబంధిచిన ఫోటోలు వైరల్ గా మారాయి.

సినీ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం (94) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కనకరత్నం అంత్యక్రియలలో సినీ నటీమణులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. అందులో భాగంగా చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అయాన్ కలిసి అంత్యక్రియలలో పాల్గొని కనక రత్నం పాడెను మోసారు.
అల్లు అరవింద్ ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్
అల్లు కనకరత్నం గారి మృతికి సంతాపాన్ని తెలియజేసి అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ https://t.co/40v3zGArt7 pic.twitter.com/uZyGW6o03r
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2025