చుక్కలు చూపిస్తున్న బంగారం వెండి ధరలు ..!

-

కాస్త తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ ఊపందుకున్నాయి. ఊహించని విధంగా పెరుగుదల నమోదు చేసింది పసిడి. కరోనా దెబ్బకు కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ పెరుగుదల నమోదు చేసాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1020 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 45,140 రూపాయల నుంచి 46,160 రూపాయలకు చేరింది.

ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 950 రూపాయలు పెరిగింది. దీంతో 41,360 రూపాయల నుంచి 42,310 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. విజయవాడ విశాఖపట్నంలో 24 క్యారెట్ ల బఁగారం 46,160 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 42,310 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 950 రూపాయలు పెరిగి 44,400 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 950 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 43,200 రూపాయల వద్దకు చేరుకుంది. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 1230 రూపాయలు పెరిగి 49,850 రూపాయల నుంచి 51,080 రూపాయలకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news