కరోనా కట్టడి పై తెలంగాణ హై కోర్ట్ కీలక వ్యాఖ్యలు

కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు లో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోరిన 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను అందించాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేమిడిసివర్ ఇంజక్షన్ టోసిలి జముద్ ఇంజక్షన్ ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రతి రోజు జిల్లాల వారిగా కోవిడ్ టెస్ట్ ల రిపోర్ట్ లను విడుదల చేయాలన్న హైకోర్టు.. ప్రతి రోజు మీడియా బులిటెన్ విడుదల చేయాలని ఆదేశించింది. మైక్రో కంటైన్మెంట్ జోన్ లలో టెస్టుల సంఖ్య పెంచాలని సూచనలు చేసింది. హితమ్ యాప్ లో కోవిడ్ వివరాలు కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిందని ప్రభుత్వ తరుపు న్యాయవాది శ్రీనివాస్ రావు వివరించారు.టోల్ ఫ్రీ నెంబర్ 040 21111111 గా ప్రక్తించినట్టు వివరించారు..