ఎన్నో కష్టాలు పడి డిగ్రీ వరకు చదువుకుని ఉత్తీర్ణులు ఐన చాలా మంది అభ్యర్థులు అర్హతకు తగిన ఉద్యోగాలు లేక మరియు దొరకక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఒక శుభవార్తను స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అందించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో మొత్తం 8283 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ముందు వచ్చింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీ విద్యార్థులకు ఈ రోజు చివరి తేదీగా తెలుస్తోంది. ఈ జాబ్ లకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులను ఉండవలసిన కనీస అర్హతలను చూస్తే, డిగ్రీ ఖచ్చితంగా ఉతీర్ణులు అయి ఉండాలి, అదే సమయంలో వీరి వయసు 20 నుండి 28 ఉండాలి.. అయితే రిజర్వేషన్ లను బట్టి సడలింపు ఉంటుందని విషయాన్నీ వీరు తెలియచేయడం విశేషం.
ఈ పరీక్షలు జనవరి లో ప్రిలిమ్స్, ఫిబ్రవరి లో మైన్స్ జరుగుతాయని ప్రకటించారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుంటే మిగిలి ఉన్న ఈ కొద్దీ సమయంలో చేసుకోవాలంటూ చెబుతున్నారు.