ఎల్ఆర్ఎస్‌కు నేడు చివరి రోజు..సాదాబైనామాలకు మ‌రో వారం..!

-

తెలంగాణ వ్యాప్తంగా ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లోని అక్ర‌మ‌, అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ను త‌ప్ప‌నిస‌రిచేస్తూ ప్ర‌భుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు నేటితో ముగియ‌నుంది..రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఆగ‌స్టు 31న ఈ ప‌థ‌కాన్ని తీసుకువచ్చింది..ఈనెల 15న ద‌ర‌ఖాస్తుల గ‌డువు ముగిసింది..అయితే రాష్ట్రంలో వ‌ర్షాలు, ప‌లు కార‌ణాల దృష్ట్యా మ‌రో 15 రోజుల‌పాటు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొండిగించింది..
గతంలోనే గడవు ముగిసినప్పటికి ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తితో మరోసారి గడవు పోడిగించింది ప్రభుత్వం..రెండవ దఫ పొడిగించిన గడువు నేటితో ముగియనుంది..దీంతో రాష్ట్ర‌వాప్తంగా ఎల్ఆర్ఎస్‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది..ఇప్పటివ‌ర‌కు దాదాపుగా 25ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయని.. నిన్న ఒక్క‌రోజే రికార్డ్ స్థాయిలో 70 వేల‌కుపైగా మంది ఎల్ఆర్ఎస్‌కోసం అప్లైయ్ చేసుకున్నారని అధికారుల తెలిపారు.. ఇప్ప‌టివ‌ర‌కు గ్రామపంచాయ‌తీల్లో 10,17,293 ద‌ర‌ఖాస్తులు రాగా, మున్సిపాలిటీల్లో 10,02,325, కార్పొరేష‌న్ల‌లో 3,94,719 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.. ఈరోజు ల‌క్ష వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నావేస్తున్నారు. కాగా, సాదాబైనామాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు మ‌రో వారం పాటు గ‌డువు ఉన్న‌ది.

Read more RELATED
Recommended to you

Latest news