సౌతాఫ్రికా టూర్ లో ఉన్న టీమిండియా నేడు అతిథ్య జట్టుతో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. మూడు వన్డే మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇప్పటికే టీమిండియా మొదటి వన్డే మ్యాచ్ లో ఓటమి పాలైంది. దీంతో ఈ రోజు జరిగే రెండో వన్డే లో గెలిచి సిరీస్ పోటీలో నిలబడాలని కెఎల్ రాహుల్ నాయకత్వం లోని టీమిండియా భావిస్తుంది. నేటి రెండో వన్డే పార్ల్ లో జరగనుంది. ఇక్కడ వేడి ఎక్కువ ఉండటంతో పిచ్ గా పొడిగా మారే అవకాశం ఉంది. దీంతో పిచ్ స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాగ ఈ మ్యాచ్ లో కూడా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచినా.. జట్టే బ్యాటింగ్ ఎంచుకుంటారు.
అలాగే టాస్ నెగ్గిన వారే.. మ్యాచ్ కూడా నెగ్గే అవకాశాలు ఉంటాయి. జోరు మీద ఉన్న సౌతాఫ్రికా ను అడ్డుకుని ఈ మ్యాచ్ లో విజయం సాధించడం కెప్టెన్ కెఎల్ రాహుల్ కు కష్టమైన పనే చెప్పాలి. అయితే ఈ సిరీస్ ను గెలిచి టెస్టు కెప్టెన్సీ ని అందుకోవాలని భావిస్తున్న కెఎల్ రాహుల్ కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. నిజానికి గత మ్యాచ్ లో అందరితో పాటు కెప్టెన్ కెఎల్ రాహుల్ మైనస్ లే ఎక్కువ గా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. పేలవ కెప్టెన్సీ తో పాటు బ్యాటింగ్ విఫలం అయ్యారని విమర్శించారు. అలాగే యువ సంచలనం వెంకటేష్ అయ్యర్ ను కెప్టెన్ వాడు కోవడంలో కూడా విఫలం అయ్యారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.