ప్రస్తుతం కష్టాలను ఎదుర్కొంటున్న టిక్ టాక్ అమ్మకం పై నేడు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒరాకిల్, వాల్‌మార్ట్ మరియు మైక్రోసాఫ్ట్ సహా మొదటి మూడు పోటీదారులతో టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డాన్స్ చివరకు ఒక నిర్ణయానికి రావచ్చని అంచనా వేస్తున్నారు. అమ్మకపు ధర 20 బిలియన్ డాలర్ల నుండి 30 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఒక నివేదిక పేర్కొంది.
టిక్ టాక్ యుఎస్ కార్యకలాపాలను మాత్రమే కాకుండా… న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా కార్యకలాపాలను కూడా పొందాలని మైక్రో సాఫ్ట్ భావిస్తుంది. ఇదే విషయాన్ని టిక్ టాక్ యాజమాన్యానికి కూడా చెప్పింది. మైక్రోసాఫ్ట్ తరువాత, ఒరాకిల్ కూడా టిక్ టాక్ యొక్క యుఎస్ కార్యకలాపాలను తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు రంగంలోకి దిగిన తాజా సంస్థ వాల్‌మార్ట్. రిటైల్ దిగ్గజం యుఎస్‌లో టిక్ టాక్‌ను సొంతం చేసుకునే ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.