పెరిగిన బంగారం వెండి అల‌గే

-

బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న దిగొచ్చిన ధర ఇవ్వాళ మళ్లీ పెరిగింది. ప్రపంచ మార్కెట్లో దెబ్బకు బంగారు ధరలు సైతం స్థిరంగా కదులుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో బంగారు ధరలు కాస్త పెరిగాయి. ఆదివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి దార 45900 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు పెరిగి 46000 వద్ద నిలిచింది.అదేవిధంగా  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర 50180 గా ఉంది.దాదాపుగా 50 వేల రూపాయల మార్కు దగ్గరే నిలిచింది.

అటు ఆంధ్రప్రదేశ్ లోను విజయవాడలో కూడా బంగారు ధరలు పై ఈ విధంగానే ఉన్నాయి. అటు వెండి ధర మాత్రం రెండు రోజుల నుంచి స్థిరంగానే ఉంది. ప్రస్తుత వెండి ధర 66800ల‌కు క్షీణించింది.పరిశ్రమ యూనిట్లు నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కరుణ మహమ్మారి అంతానికి  వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న వార్తల నేపథ్యంలో పసిడి ధరలు అమాంతం దిగివస్తున్నాయి.అటు లండన్ లోను ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ సాధారణ ప్రజలకు ఇచ్చిన నేపథ్యంలో కరోనా తగ్గిందన్న వార్తలు స్టాక్ మార్కెట్లకు ఊపిరి అందిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు నేలచూపులు చూసింది.

Read more RELATED
Recommended to you

Latest news