MAA ELECTIONS : ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణుకు మద్దతు ప్రకటించిన బాలకృష్ణ !

-

మా అసోషియేషన్‌  ఎన్నికలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఆస‌క్తిగా మారుతున్నాయి మా అసోషియేషన్‌  ఎన్నికలు. ఇక  తాజాగా  మా అసోషియేషన్‌  ఎన్నికల నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. మంచు విష్ణు ప్యానల్‌, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు తమ తమ నామినేషన్‌లు దాఖలు చేశారు.ఎన్నికల తేదీ అక్టోబ‌ర్ 10 స‌మీపిస్తున్న కొద్ది ప్రచారం మ‌రింత‌ జోరుగా సాగుతుంది.

అయితే.. ప్రకాశ్‌ రాజ్‌ టీం కు మెగా ఫ్యామిలీ, అలాగే.. మంచు విష్ణు టీం కు మోహన్‌ బాబు తో పాటు నందమూరి ఫ్యామిలీ సపోర్టు ఉన్నట్లు గత కొన్ని రోజులు గా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో నందమూరి బాలకృష్ణ… మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణుకు మద్దతు ప్రకటించారు.

ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. “ఈ మా ఎన్నికలలో నాకు ఆశీర్వదించిన మరియు మద్దతు ఇచ్చిన ఏకైక నటసింహం, బాల అన్నకు ధన్యవాదాలు. మీ మద్దతు నాకు లభించడం నా గౌరవం.” అంటూ మంచు విష్ణు పేర్కొన్నాడు. అంతేకాదు.. బాలయ్య తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు మంచు విష్ణు.

Read more RELATED
Recommended to you

Latest news