ఓటు వేసిన సెలబ్రిటీస్.. మా డ్యూటీ మేం చేశాం మరి మీరు..?

-

ఏపిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలతో పాటుగా తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ప్రజలతో పాటుగా తాము కూడా ముందు ఉన్నామని సెలబ్రిటీస్ అంటున్నారు. ప్రజల కంటే ముందు గానే సెలబ్రిటీస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈరోజు ఎలక్షన్స్ కావడం వల్ల తమ చిత్రయూనిట్ సగం ఖాళీ అయ్యిందని అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి.

ఐదేళ్లలో నాయకుడిని ఎన్నుకునే అవకాశం వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని సెలబ్రేట్ చేసుకునే ఓట్ టైం ఇది అంటూ నాగార్జున ట్వీట్ చేశాడు. ఇక తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు అక్కినేని అమల. హైదరాబాద్ లో ఆమె ఓటు వేశారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు. ఉదయం 7.30కి క్రౌడ్ లేకపోవడంతో ఒత్తిడి లేకుండా ఓటు వేశానని ఐ లవ్ ఇండియా అని ఆమె ట్వీట్ చేశాడు.

ఇక మెగా హీరో సాయి ధరం తేజ్ కమాన్ గ్లాస్ మేట్స్ వెళ్లి ఓటెయ్యండని ట్వీట్ చేశాడు. అంతేకాదు తాను ఓటు వేసిన పిక్ షేర్ చేశాడు. నా డ్యూటీని పూర్తి చేశా సమయం వేస్ట్ చేయకుండా ఓటు వేయండని సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. ఇక మంచు మోహన్ బాబు, ఉపాసన, రాం చరణ్ ఇలా అందరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news