బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో ముగిసిన రవితేజ ఈడీ విచారణ

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు లో హీరో రవి తేజ ఈడీ అధికారుల విచారణ ముగిసింది. డ్రగ్స్‌ కేసు మరియు మనీలాండరింగ్‌ వ్యవహారం లో ఈడీ అధికారులు హీరో రవి తేజ ను విచారణ చేశారు. హీరో రవి తేజ తో పాటు, అతని డ్రైవర్‌, కెల్విన్‌ స్నేహితుడు జిసాన్‌ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. హీరో రవి తేజ ను దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధి కారులు.

పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం హీరో రవి తేజ విచారణ ను ముగించారు. కాసేపటి క్రితమే డ్రగ్స్‌ కేసు లో హీరో రవి తేజ ఈడీ అధికారుల విచారణ ముగిసింది. విచారణ ముగియగానే… మీడియా కంట పడకుండా… రవి తేజ తన కారులో ఎక్కి… మళ్లీ గెస్ట్‌ హౌజ్‌ కు వెళ్లారు. కాగా.. ఇవాళ ఉదయం 10 గంటల సమయం లో ఈడీ విచారణ హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే పూరి, చార్మి, రకుల్‌, రానా, నందు, నవ దీప్‌ మరియు ఇవాళ రవి తేజ హజరయ్యారు.