టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సోమవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆన్ లైన్ టికెట్ ధరలతో పాటు థీయేటర్స్ సామర్థ్యం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఇటీవల మూత పడ్డ 175 థీయేటర్ల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. కాగ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డితో మెగా స్టార్ చిరంజీవి సమావేశం అయిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో టాలీవుడ్ సమస్యలు, ఆన్ లైన్ టికెట్ ధరల అంశంతో పాటు మరి కొన్ని అంశాలపై సీఎం జగన్ తో మాట్లాడానని మెగా స్టార్ చిరంజీవి చెప్పారు. కాగ సీఎం జగన్ – చిరంజీవి మధ్య జరిగిన సమావేశం గురించి కూడా ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా టికెట్ ధరల విషయంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య కొద్ది రోజుల పాటు మాటల యుద్ధం నడిచింది. కాగ సీఎం జగన్ తో చిరంజీవి సమావేశం తర్వాత మాటల యుద్ధానికి తెర పడింది.
సీఎం జగన్ అన్ని సమస్యలు పరిష్కరిస్తారని.. అప్పటి వరకు ప్రభుత్వం పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చిరంజీవి అందరినీ కోరారు. ఈ సమావేశం తర్వాత మరోసారి సీఎం జగన్ ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు కలిసే అవకాశం ఉంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో థీయేటర్లు ఓపెన్ చేయాలని, టికెట్ ధరల విషయంలో మరోసారి ఆలోచించాలని కోరే అవకాశం ఉంది.