బండ్ల గ‌ణేష్‌ను కాపాడుతోన్న ఏపీ మంత్రి ఎవ‌రు…?

-

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ కొద్దిరోజులుగా వరుసగా వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మరో అగ్ర నిర్మాత, వైసీపీ నేత పీవీపీ బండ్ల గణేష్‌పై కేసు పెట్టడంతో గణేష్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు తాజాగా మరో కేసు విషయంలో బండ్ల గణేష్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే గణేష్ అరెస్టు అయిన ఒక్కరోజులోనే బెయిల్ వచ్చేసింది. ఈ బెయిల్ రావడం వెనక ఏపీకి చెందిన ఒక మంత్రి కీలకపాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బండ్ల గణేష్‌ పై ఓ వ్యక్తి కేసు పెట్టడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కడప కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ ఈలోపే అనూహ్యంగా బండ్లకు బెయిల్ వచ్చేసింది. ఈ వివాదం అస‌లు విష‌యంలోకి వెళితే క‌డ‌ప జిల్లాకు చెందిన మ‌హేష్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర గ‌ణేష్ 2011లో రు.13 కోట్ల అప్పు తీసుకున్నాడు. అయితే ఈ డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డంతో గ‌ణేష్‌పై మ‌హేష్ చెక్ బౌన్స్ కేసు పెట్టాడు.

క‌డ‌ప పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా క‌డ‌ప కోర్టుకు రావాల‌ని చెప్పినా గ‌ణేష్ మాత్రం ఆ ఆదేశాలు బేఖాతార్ చేశాడు. దీంతో గ‌ణేష్‌పై కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో క‌డ‌ప పోలీసులు ఆయ‌న్ను అరెస్టు చేశారు. ఇక అంత‌కంటే ముందు మ‌రో నిర్మాత పీవీపీ విష‌యంలోనూ గ‌ణేష్ వార్త‌ల్లో నిలిచారు. టెంప‌ర్ సినిమా టైంలో పీవీపీ ద‌గ్గ‌ర రు.5 కోట్లు తీసుకున్న‌ట్టు ఆయ‌న ఆరోపించారు.

ఇక న్యాయ‌మూర్తి 14 రోజుల రిమాండ్ విధించినా బండ్ల వెంటనే బెయిల్ మీద బయటకు రావడం వెనక ఏపీకే చెందిన ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడుగా ఉండే ఓ మంత్రి చ‌క్రం తిప్పార‌ని అంటున్నారు. అందుకే బండ్ల‌కు అంత త్వ‌ర‌గా బెయిల్ వ‌చ్చింద‌ని అంటున్నారు. స‌ద‌రు మంత్రి గతంలో మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న‌కు బండ్ల బినామీ అన్న ప్ర‌చారం జ‌రిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version