టాలీవుడ్ నిర్మాత ఆత్మహత్యా యత్నం…?

-

కరోనా దెబ్బ సినిమా పరిశ్రమకు ఏ విధంగా తగిలిందో అందరికి తెలిసిందే. కరోనా దెబ్బకు సినిమా నిర్మాతలు అందరూ కూడా భారీగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. సినిమాలను చెయ్యాలి అనుకున్న వాళ్ళు హీరోలకు భారీగా అడ్వాన్స్ లు ఇచ్చారు. అది కూడా అప్పులు తీసుకొచ్చి ఇచ్చారు. అగ్ర హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా ఈ అడ్వాన్స్ లు ఇవ్వడమే కాదు దర్శకులతో డేట్స్ కూడా తీసుకున్నారు.

సినిమాలో రుణాలు అంటే భారీగా ఉంటాయి. ఇక వాటికి వడ్డీ కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటుంది అనే సంగతి తెలిసిందే. అందుకే నిర్మాతలు ఇప్పుడు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీలు తీసుకుని సినిమాలు మొదలుపెట్టి ఆ సినిమాలు సగంలో ఆగిపోయిన నిర్మాతలకు ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. దీనితోనే ఒక టాలీవుడ్ నిర్మాత ఆత్మహత్యా యత్నం చేసాడని అంటున్నారు. ఇటీవల సదరు నిర్మాత ఒక హీరోకి అడ్వాన్స్ ఇచ్చాడు.

అలాగే ఒక సినిమాను లైన్ లో పెట్టుకుని విడుదల చేయించడానికి సిద్దం అయ్యారు. అయితే కరోనా కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. అటు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కూడా ఆర్ధికంగా ఇబ్బంది పెట్టడంతో నిర్మాత మీద ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. దీనితో తన ఇంట్లో ఆత్మహత్యా యత్నం చేసారని సమాచారం. తనను ఆదుకునే వాడు ఎవరూ లేరని తనకు ఇప్పుడు సినిమా హిట్ అయినా సరే కష్టాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. సినిమాలను ఇప్పట్లో ఓకే చేసే అవకాశం లేదు. వినోద కార్యక్రమాలను కొన్నాళ్ళ పాటు ఆపేసే ఆలోచనలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news