ఉద్యోగాల విషయంలో దేశ చరిత్రలో మాదే రికార్డు : సీఎం రేవంత్ రెడ్డి

-

TGPSC ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డిసెంబర్ 03, 2023 నుంచి ఇప్పటివరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇది దేశ చరిత్రలోనే రికార్డు అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం ఈ ఘనత సాధించలేమని.. 2023 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉంటే 2024 జులై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి తగ్గింది అని తెలిపారు.

ఇవన్నీ మా కష్టానికి ప్రతిఫలం అని అసెంబ్లీలో చెప్పారు. మరోవైపు కేసీఆర్ పై తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసన చేపట్టడం పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఒకప్పుడు అధికారంలో ఉండే.. తరువాత ప్రతిపక్షానికి పడిపోయింది. అనంతరం 8 ఎంపీ సీట్లు కోల్పోయి గుండు సున్నాకు పడిపోయి మార్చురికి వెళ్లిందని అన్నాను.. నేను మాట్లాడింది తప్పా.. కానీ తాను కేసీఆర్ ను అన్నట్టు హరీశ్ రావు, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు. అలాంటి స్వభావం నాది కాదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news