BREAKING : టాలీవుడ్‌ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అరెస్ట్‌

-

హైదరాబాద్‌ మహానగరంలోని పబ్‌ లపై నిన్న రాత్రి పోలీసులు వరుసగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే.. నిన్న నగరంలో నిర్వహించిన రేవ్‌ పార్టీని కూడా పోలీసులు భగ్నం చేసినట్లు తెలుస్తోంది. రాడిసన్‌ బ్లూ హోటల్‌ పై టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు ఒక్క సారిగా దాడులు చేశారు.

ఈ దాడుల్లో ఏకంగా… 150 మందిని అరెస్టు చేశారు అధికారులు. ఫుడింగ్‌ మింక్‌ అనే పబ్‌ పై కూడా అధికారులు దాడులు చేశారు. పార్టీలో డ్రగ్స్‌ వాడినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు.

అయితే.. నిన్న పోలీసులు అరెస్టు చేసిన వారిలో.. టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌, బిగ్‌ బాస్‌ ఫేం రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఉన్నారని ప్రాథమిక సమాచారం అందుతోంది. రాహుల్‌ తో పాటు… మరో ఇద్దరు నటులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కానీ వారి ఎవరో తెలియాల్సి ఉంది. ఇక నిన్న అరెస్టు అయిన 150 మందిని.. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news