ఏపీలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు

-

ఏప్రిల్‌ 4 వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో… 26 కొత్త జిల్లాలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్ నియామకం కాగా.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక నియామకం అయ్యారు.

విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక కొనసాగుతుండగా… పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు నియామకం అయ్యారు. అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి, అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్, కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి, తూ.గో. జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, ప.గో. జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్‌, ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి నియామకం అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కొనసాగుతున్నారు. విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగుతుండగా.. గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news