రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..ఈ అంశాలపైనే చర్చ..?

సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో దళిత బంధు అమలు, గణేశుని నిమజ్జనం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. సమావేశం లో దళిత బంధు నిధులతో ఎస్సీ ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా మాట్లాడనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి….?

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఏయే అంశాలను చర్చించాలని కూడా ఈ భేటీ లో చర్చించనున్నారు. ఇక ఇప్పటికే దళిత బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిధులు వృథా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు. మరో వైపు హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై హై కోర్టు ఆంక్షల నేపథ్యం లో రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళుతోంది. దాంతో ఈ అంశం పై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.