రాయితీపై టమాటా సరఫరా: మార్కెటింగ్ శాఖ

-

రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలపై మంగళవారం మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. రిటైల్‌ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.55 నుంచి రూ.65 పలుకుతుండగా..రైతు బజారులో కిలో రూ.54 ఉందని అధికారులు వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో టమాటా సాగు లేకపోవడం, చిత్తూరు జిల్లాలో మాత్రమే ఉత్పత్తి కారణంగా డిమాండ్‌ పెరిగినట్టు అధికారులు తెలిపారు.

వర్షాల ప్రభావంతోనూ ధర పెరిగినట్టు అంచనా వేస్తున్నారు.ధరల స్థిరీకరణ నిధి ద్వారా చిత్తూరు జిల్లాలోని మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసి, రైతు బజార్లలో అదే ధరకు విక్రయించనున్నట్లు తెలిపారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని మార్కెట్ల నుంచి దాదాపు 30 టన్నుల టమాటా కొనుగోలు చేసి గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోని రైతు బజార్ల ద్వారా కొనుగోలు ధరలకే విక్రయించనున్నట్టు తెలిపారు. టమాటా కొనుగోళ్ల కోసం ప్రతి జిల్లా అధికారి ఆధీనంలో రూ.5లక్షలతో రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news