Vastu Tips : బెడ్రూమ్ ఇలా ఉంటే ఐశ్వర్యం మీ సొంతం..!

-

వాస్తు.. అంటే ఇది ఒక సైన్స్‌. దీనిలో అసలు విషయాన్ని వదిలివేసి అనేకానేక ఇతర విషయాలు చొప్పించడం వల్ల కొన్ని నష్టాలు వస్తున్నాయి. అయితే అసలు వాస్తు అంటే ఇంట్లో గాలి, వెలుతురు ధారళంగా రావడంతోపాటు ఆయా వాయువులు పోవాల్సిన మార్గాలు, ఎక్కడ ఏది ఉంటే అందరికీ సౌఖ్యంగా ఉంటుందో తెలియజేప్పే శాస్త్రం. దీని ప్రకారం ఇండ్లు నిర్మించుకుంటే ఆరోగ్యంగా, ఆనదంగా ఉంటామని వేలాది ఏండ్లుగా భారతీయులు దీన్ని ఆచరిస్తున్నారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో బెడ్‌రూం అదేనండి పడకగది ఎలా ఉండాలో తెలుసుకుందాం…

సాధారణంగా ప్రతిఒక్కరు తమ ఇళ్లల్లో ఒక ప్రత్యేక గది (పడక గది)ని నిర్మించుకుంటారు. అవి అవసరాన్ని బట్టి ఒకటి, రెండు, మూడు లేదా నాలుగు కూడా ఉంటున్నాయి. అయితే వాస్తుప్రకారం ఇల్లు నిర్మాణం బాగున్నప్పటికీ, తరుచుగా ఆచరించాల్సిన నియమాలు, సంప్రదాయాలను ప్రతిఒక్కరు మర్చిపోతుంటారు. ఇల్లు అలంకరణ బాగానే వున్నప్పటికీ.. లోపలున్న పడక గది గురించి అంతగా పట్టించుకోరు. వాస్తుప్రకారం పడక గదిలో కూడా కొన్ని ఆచారాలను పాటించాల్సి వస్తుంది. తద్వారా దంపతుల మధ్య ఎటువంటి విభేదాలు వుండక.. సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. లేకపోతే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

వాస్తుప్రకారం పాటించాల్సిన నియమాలు ఇవే…

ముందుగా పడకగదిని వాస్తుప్రకారం అనువైన దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. నిత్యం సానుకూల శక్తి ప్రవహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతారు. సాధారణంగా నైరుతిలో మాస్టర్‌బెడ్‌రూం, ఈశాన్యంలో, పశ్చిమంలో పిల్లల బెడ్‌రూంలు నిర్మించుకోవాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే సందర్భాన్ని బట్టి అంటే ఇంటి సింహద్వారం ఉన్నదాని బట్టి బెడ్‌రూం నిర్మించుకోవాలి.

ముఖ్యంగా మీరు మీ పడకగదిలో అద్దాన్ని వుంచుకోకపోవడం చాలా మంచిది. ఒకవేళ అద్దం వుంటే.. అది పడకగదిని నలువైపులా ప్రతిబింబించేలా చేస్తుంది. దాంతో ప్రతికూల వాతావరణం పెరిగి.. దాంపత్య జీవితానికి అనుకోని సంఘటనలను తెచ్చిపెడుతుంది. కాలం చేయిదాటిపోతే.. వైవాహిక విచ్ఛిన్నానికి కూడా దారితీసే అవకాశం వుంది. ఇక అనవసరమైన సామాన్లు, ఫోటోలు ఉండకూడదు. ప్రశాంత వాతావరణం, ఆహ్లాదకరంగా ఉండేలా బెడ్‌రూంలను నిర్మించుకోవాలి.

 

శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news