ఐపీఎల్ 2022 మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. దీని కోసం బీసీసీఐ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అంతే కాకుండా ఆటగాళ్ల కోసం కఠినమైన బయో బబుల్ ను కూడా సిద్ధం చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ సారి బయో బబుల్ ను పక్కాగా నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అందుకోసం కోన్ని నిబంధనలు తీసుకువచ్చింది. బయో బబుల్ ను ఉల్లంఘించిన ఆటగాడిపై వేటు వేయడానికీ కూడా వెనకడుగు వేయమని స్పష్టం చేసింది.
కాగ ఏ ఆటగాడు అయినా.. తొలిసారి బయో బబుల్ ను ఉల్లంఘిస్తే.. తప్పని సరిగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతారు. అలాగే రెండో సారి ఉల్లంఘన చేస్తే… ఒక మ్యాచ్ పై బ్యాన్ కూడా విధిస్తారు. అలాగే మూడో సారి బయో బబుల్ దాటితే.. ఏకంగా లీగ్ నుంచే తొలగిస్తామని బీసీసీఐ హెచ్చరించింది. కాగ ఇలా లీగ్ నుంచి తొలగించబడ్డ ఆటగాడి స్థానంలో మరో ఆటగాడికి కూడా అవకాశం ఇవ్వమని తెల్చి చెప్పింది.
అలాగే ఆటగాళ్లు బయో బబుల్ దాటితే.. ఫ్రాంచైజీలు కూడా భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. ఆటగాడు మొదటి సారి బయో బబుల్ దాటితే.. రూ. కోటి జరిమానా అని ప్రకటించింది. అలాగే రెండో సారికి ఒక పాయింట్ కోత, మూడో సారికి రెండు పాయింట్ల కోత ఉంటుందని స్పష్టం చేసింది.