తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. బదిలీలపై త్వరలోనే కీలక ప్రకటన చేయనుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి అయి… వారి విధుల్లో చేరడానికి ముందే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియర్లకు ప్రాధాన్య స్థానాలు ఇచ్చి తద్వారా ఏర్పడే ఖాళీలను కొత్త వారికి ఇవ్వాలని భావిస్తోంది.
మే-జూన్ మాసం లో ఇది జరగవచ్చని అంచనా. జనవరిలో కొత్త జోనల్ విధానం కింద ఉద్యోగుల బదలాయింపు జరగగా… జిల్లా స్థాయిలోని వారు కొత్త స్థానాల్లో చేరారు. జోనల్, మల్టీ జోనల్ లో బదిలీ అయిన వారు ఈ నెల ఆఖరి లో చేరనున్నారు. పరస్పర బదిలీలు నెలాఖరు వరకు పూర్తి కానున్నాయి.
ఆప్పీల్ లో అలాగే భార్య భర్తల వినతి మేరకు అర్హులైన మరికొందరికీ ఏప్రిల్ తొలివారంలో బదిలీలకు అవకాశం లభిస్తుంది. 13 ముఖ్యమైన జిల్లాల్లో అధిక శాతం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు దగ్గరలో ఉండే పలు పోస్టులు ఖాళీగా ఉండగా వాటికి బదిలీలు జరగలేదు. వచ్చే సాధారణ బదిలీలలో కౌన్సిలింగ్ ద్వారా వాటిని భర్తీ చేస్తారు. మిగిలిన ఖాళీలను కొత్త ఉద్యోగులతో నిర్మిస్తారని తెలుస్తోంది.