జీహెచ్ఎంసీలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారుల తీర్పును నిరసిస్తూ ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానని నిరసన వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, విజిలెన్స్ అధికారులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అధికారులపై యాక్షన్ తీసుకుంటేనే బయటికి వెళ్తానని సదరు వ్యక్తి డిమాండ్ చేశారు.
వెంటనే టౌన్ ప్లానింగ్ ఏసీపీని, డీసీని సస్పెండ్ చేయాలని ఆందోళన చేశాడు. ముషీరాబాద్ ఏసీపీ దేవేందర్ లంచం తీసుకొని తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆందోళనకు దిగాడు. డిప్యూటీ కమిషనర్, ఎసీపీ కరప్ట్ అయ్యి తనకు అన్యాయం చేశారంటూ సదరు బాధిత వ్యక్తి ఆరోపించారు. వెంటనే వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లేనియెడల ఇక్కడి నుంచి కదిలేది లేదని పంతం పట్టి కూర్చున్నట్లు సమాచారం.