చికెన్ మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ అయిన సంఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ చోటు చేసుకుంది. బంజారాహిల్స్ నంది నగర్ లో 20 మందికి పైగా అస్వస్థత కు గురయ్యారు. సింగాడికుంట లో ఓ వివాహిత మృతి చెందింది. వారాంతపు సంతలో మెమోస్ పెట్టారట నిర్వాహకులు. దీంతో బంజారాహిల్స్ నంది నగర్ లో 20 మందికి పైగా అస్వస్థత కు గురయ్యారు.
బాధితులు…మరింత మంది పెరుగుతున్నారని సమాచారం. దీంతో ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వందలాది మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స కూడా అందిస్తున్నారట. పలువురు ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వారాంతపు సంత లో మెమోస్ పెట్టింది ఎవరూ.. అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.