నంబర్ ప్లేట్‌ చూసి జరిమానా వేసిన పోలీసులు.. షాక్‌లో డ్రైవర్..

-

ఢిల్లీలో కొత్తగా ప్రవేశపెట్టిన సరి-బేసి సంఖ్యల అమ‌ల్లో ఉన్న‌ నేప‌థ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఐటీవో సమీపంలో తాపీగా రోడ్డు మీదికి వచ్చిన ఓ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని జరిమానా విధించారు. సరిసంఖ్య అమల్లో ఉన్నరోజు బేసి సంఖ్య ఉన్న నంబర్ నంబర్‌తో బయటికి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించడంతో డ్రైవర్ షాక్‌కు గుర‌య్యాడు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు పలకరించడంతో సదరు డ్రైవర్ మాట్లాడుతూ.. `నేను నోయిడాలో ఉంటాను.

ఓ పని నిమిత్తం గత రాత్రి ఇక్కడికి వచ్చాను. వాస్తవానికి ఇవాళ ఇక్కడ సరి-భేసి విధానం అమల్లోకి వచ్చిందని నాకు తెలియదు` అని వాపోయాడు. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరగడంతో.. కేజ్రీవాల్‌ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమల్లోకి తెచ్చింది‌. కాలుష్యం పెరిగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామనీ… దీనికి ప్రజలు సహకరించాలని కేజ్రీవాల్ కోరారు. రిజిస్ట్రేషన్ నెంబరు చివరిలో సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజు… బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్డు మీదకు రావాలని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news