`శీన‌య్య` సినిమాలో హీరోగా డైరెక్టర్‌.. విలన్‌గా హీరో..

-

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సీనయ్య’. ఈ సినిమాను ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. గ‌తం నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ‘శరభ’ ఫేమ్ నరసింహ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన వినాయ‌క్ లుక్ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. న‌టుడిగా ట‌ర్న్ అవ్వ‌డం కోసం వినాయ‌క్ ప‌డిన క‌ష్టం ఆ పోస్ట‌ర్స్ లో క‌నిపిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం నవీన్ చంద్రను తీసుకున్నారనేది తాజా సమాచారం.

హీరోగా తన కెరియర్ ను ప్రారంభించిన నవీన్ చంద్ర .. కీలకమైన పాత్రలతో పాటు విలన్ పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు. ‘అరవింద సమేత’లో విలన్ గా చేసిన నవీన్ చంద్ర, ‘ఎవరు’ సినిమాలోను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో మెప్పించాడు. ‘శీనయ్య’ సినిమాలోను ఆయన విలన్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news