యూపీలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. బాగ్పత్లో జైనులు ఏర్పాటు చేసిన లడ్డూ మహోత్సవ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఒక్కసారిగా జనం పెద్ద ఎత్తున స్టేజీ మీదకు రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఆ పరిసరాల్లో భద్రతా వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ దారుణ ఘటనపై యూపీ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. కాగా,నిర్వాహకులపై చర్యలకోసం ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.