వనపర్తి బుద్దారంలో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి

వనపర్తి జిల్లాలో పండువేళ విషాదం నెలకొంది..గోపాల్ రావుపేట మండలం బుద్దారంలో ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు..ప్రాణాలు కోల్పోయినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి..గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స్ అందిస్తున్నారు..మృతులు అత్త మణెమ్మ, కోడళ్లు, మనవరాళ్లుగా గుర్తించారు..చనిపోయిన తమ బంధువు సంవత్సరికం కోసం వచ్చిన కుటుంబ సభ్యులు గదిలో నిద్ర పోతున్న సమయంలో ఇంటి మిద్దె అకస్మాత్తుగా కూలి మృత్యువాతపడ్డారు..ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మిద్దె నాని ఉండటంతో అకస్మాత్తుగా స్థానికులు వెల్లడించారు..ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.