రాజధాని మార్పుపై ఏపీ సర్కార్ మరో ముందడుగు..! భారీగా కమిషనర్ల బదిలీలు

రాజధాని మార్పుపై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పోరేషనల్లో కమిషనర్లు, డెప్యూటీ కమిషనర్ల బదిలీలు చేసింది ఏపీ సర్కార్. గ్రేటర్‌ విశాఖ కార్పోరేషన్‌ కేంద్రంగా ఈ బదిలీలు చేసింది. విశాఖకు రాజధాని తరలిస్తారనే ప్రచారం జరుగుతోన్న సందర్భంలో జీవీఎంసీ కేంద్రంగా జరిగిన బదిలీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. జీవీఎంసీ పరిధిలో వివిధ హోదాల్లో మార్పులు చేర్పులు చేసింది. జీవీఎంసీ డెప్యూటీ కమిషనర్‌గా నల్లనయ్యను నియమించిన సర్కార్… జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌గా వెంకట రమణను నియమించింది. అలాగే జీవీఎంసీ డీపీఓలుగా రమేష్‌ కుమార్‌, ఫణి రామ్‌ లను నియమించింది.

జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ పి. సింహాచలాన్ని పట్టణాభివృద్ది శాఖ కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ జోనల్‌ కమిషనర్ శ్రీరామ్‌ మూర్తి సొంత శాఖకు బదిలీ కాగా… జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ సీహెచ్‌ గోవింద రావును మాతృస్థానానికి బదిలీ అయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్‌ కార్యాలయానికి ఎన్‌. మల్లిఖార్జున్‌ బదిలీ కాగా… శ్రీకాకుళం మున్సిపల్‌ కమిషనర్‌గా ఓబులేసును నియమించింది సర్కార్.