భారత్ లో ట్రిఫో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు ..!

-

కాలిఫోర్నియాకు చెందిన ట్రిఫో కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా రోబోట్ – బేస్డ్ టెక్నాలజీలో మంచి గుర్తింపు పొందిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రెండు వ్యాక్యూమ్ క్లీనింగ్ రోబోట్లను భారత్ లో కూడా ట్రిఫో కంపెనీ వారు లాంఛ్ చేసారు. రెండు మోడళ్ళు అయిన ‘ఎమ్మా పెట్’, ‘ఎమ్మా స్టాండర్డ్’ వ్యాక్యూమ్ క్లీనింగ్ రోబోట్లను భారత్ లో లాంఛ్ చేసింది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో ఈ వ్యాక్యూమ్ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్యూమ్ క్లీనర్లు వై-ఫై కనెక్టివిటీతో పని చేస్తాయి. అమెజాన్ అలెక్సా వాయిస్ కంట్రోల్ తో చాలా ఈజీగా, హ్యాపీగా ఆపరేట్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. ట్రీఫా హోమ్ మొబైల్ యాప్ ద్వారా ఈ వ్యాక్యూమ్ క్లీనర్లను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యాపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో కూడా ఈ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

vaccum cleaner
vaccum cleaner

ఎమ్మా స్టాండర్డ్, ఎమ్మా పెట్ వ్యాక్యూమ్ క్లీనింగ్ రోబోట్ ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మా పెట్ 23990 రూపాయలకు లభించనుంది. ఎమ్మా స్టాండర్డ్ వ్యాక్యూమ్ క్లీనింగ్ రోబో ధరను 21990 రూపాయలుగా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్ లో ఈ వ్యాక్యూమ్ క్లీనర్లను అందిచనున్నాయి. ఫెస్టివ్ సీజన్ లో భాగంగా 2000 రూపాయలు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఎమ్మా స్టాండర్డ్, ఎమ్మా పెట్ వ్యాక్యూమ్ క్లీనింగ్ రోబోట్ల ప్రత్యేకతలు ఏమిటంటే .. ఎమ్మా సిరీస్ లో రిలీజ్ అయిన ఈ వ్యాక్యూమ్ క్లీనర్స్ కు 2600 mah గల బ్యాటరీ ఉండటం వల్ల 110 నిమిషాల పాటూ క్లీన్ చేస్తుంది.

ఒకవేళ బ్యాటరీ తక్కువ అయితే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ చేసుకునేలా బేస్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇందులో డస్ట్ బిన్ సైజ్ అయితే 600 ml ఉంటుంది. “అలెక్స, టర్న్ ఆన్ ఎమ్మా” అంటూ వాయిస్ కమాండ్స్ ఇస్తే దాన్ని కంట్రోల్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం వ్యాక్యూమ్ క్లీనర్ ను ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news